![]() |
![]() |

కామెడీ స్టాక్ ఎక్స్చేంజి నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. చైర్మన్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో హోస్ట్స్ సుధీర్, దీపికా పిల్లి ఆధ్వర్యంలో ఈ షో మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటోంది. ఇక ఇందులో కామెడీ పీక్స్ లో ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇక రాబోయే వారం కామెడీ స్టాక్ ఎక్స్చేంజి ఎపిసోడ్ లో న్యూస్ బులెటిన్స్ లో వచ్చే స్క్రోలింగ్స్ ని మిక్స్ చేసి చదివితే ఎలా ఉంటుంది అనే అంశంపై వేణు వండర్స్ చేసిన కామెడీ చదివిన స్క్రోలింగ్స్ బాగా నవ్వు తెప్పించాయి.
"అవకాశం వస్తే న్యూడ్ గా నటిస్తానంటున్న సుడిగాలి సుధీర్, త్వరలో భూకంపం పొంచి ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారులు" అని చెప్పాడు. తర్వాత సద్దాం వచ్చి న్యూస్ యాంకర్ లా పైన కోట్ వేసుకుని న్యూస్ చదువుతూ న్యూస్ చదివే వాళ్ళు పైకి ఇలా పోష్ గా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఇలా లుంగీ కట్టుకుని ఉంటారు అని చేసి చూపించాడు. అలాగే న్యూస్ చదివేవాళ్ళు తప్పసరిగా ప్రాసలతోనే చదువుతారు అవి ఎలా ఉంటాయి అంటే "అమీర్ పెట్ లో జరిగిన హత్య..వాడి పేరు సత్య" "నిన్న రాత్రి ఎంఎల్ ఏల విందు, 11 దాటితే మందు బందు" అని చెప్పి ఎండ్ చేసాడు.
ఇక సుడిగాలి సుధీర్ టీవీ పెట్టి ప్రోగ్రామ్స్ బాలేదంటూ చానెల్స్ మార్చుతుంటే ఆ ప్రోగ్రామ్స్ హోస్ట్ లు లైవ్ లో ఇంటికి వచ్చి మరీ సుధీర్ ని సతాయిస్తారు. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద రాబోయే వారం అంటే 16 వ తేదీన ఆహాలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది.
![]() |
![]() |